- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila: తీగలాగుతుంటే మోడీ డొంక కదులుతోంది.. EC స్పందించకుంటే అదే నిజమని నమ్ముతాం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం(Modi Govt)పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా(ఎక్స్) పోస్టు పెట్టారు. ‘ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) తీగలాగుతుంటే మోడీ డొంక కదులుతోంది. ఓట్ల దొంగ మోడీ బాగోతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతుంది. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టేందుకు పథకం ప్రకారమే దేశంలో ఓట్ చోరీ జరిగింది. నేడు ECIపై రాహుల్ పేల్చింది హైడ్రోజన్ బాంబే. వాస్తవాలను ఆధారాలతో సహా రాహుల్ గాంధీ దేశం ముందుంచారు. ఓట్ల దొంగను CEC ఎలా కాపాడుతున్నారో కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని బీజేపీ అధికారం కోసం మోడీ చేసింది నిజంగా చీకటి రాజకీయమే.
స్వయం ప్రతిపత్తి సంస్థ ECI ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసింది. మోడీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు, వద్దనుకున్న చోట్ల ఓట్లు తొలగించి బీజేపీ చేతుల్లో కీలుబొమ్మలా మారింది. కాంగ్రెస్ విజయం సాధించే అలంద్ నియోజక వర్గంలో 6 వేల ఓట్లను నకిలీ లాగిన్లతో తొలగించడం సహించరాని చర్య. సాఫ్ట్ వేర్‌ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ఉపయోగించడం అంటే ఇది దేశ ద్రోహంతో సమానం. నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఫోన్ నంబర్లతో అక్రమంగా ఓట్లను తొలగించడం ఉగ్రవాద చర్యకు నిదర్శనం.
రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా ECI వెంటనే స్పందించాలి. ఎన్నికల సంఘం ఒక వారంలోపు తీసివేసిన ఓటర్ల వివరాలు బయటపెట్టాలి. వాటికి ఉపయోగించిన ఫోన్ నంబర్లు, OTPల సమాచారం విడుదల చేయాలి. లేకపోతే ఇది మరోసారి ఓట్ల చోరీకి నిదర్శనమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే వారిని ECI స్వయంగా కాపాడుతున్నట్టు పరిగణించాల్సి ఉంటుంది’ అని ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






