- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Sharmila: వైసీపీ చేసిన తప్పే.. ఇప్పుడు పులివెందులలో టీడీపీ చేస్తోంది
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘గతంలో కుప్పంలో వైసీపీ చేసిందే ఇప్పుడు పులివెందులలో టీడీపీ చేసింది. జగన్(Jagan)కి చంద్రబాబుకి పెద్ద తేడా లేదు. కుప్పంలో ఆనాడు జగన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే.. ఈనాడు పులివెందులలో చంద్రబాబు(Chandrababu) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఇద్దరు కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. ఎన్నికల్లో తాలిబన్ల లెక్క వ్యవహరిస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రధాని మోడీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. మరోవైపు మోడీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే ఇద్దరు నాయకులు నోరు ఎత్తడం లేదు. ఎందుకంటే ఒకరిది బహిరంగ పొత్తు. మరొకరిది అక్రమ పొత్తు. ఇందులో భాగంగానే రాష్ట్ర ఎంపీలు మొత్తం బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. రాష్ట్రంలో, దేశంలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలి. అధికారంలోకి రావాలి’ అని ట్వీట్‌లో షర్మిల పేర్కొన్నారు.






