‘ఆహా.. ఓహో అని డప్పు కొట్టడమేంటి’?.. సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-29 10:10:38  IST  )

‘ఆహా.. ఓహో అని డప్పు కొట్టడమేంటి’?.. సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్

‘ఆహా.. ఓహో అని డప్పు కొట్టడమేంటి’?.. సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)పై కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె కావాలా? అనేలా ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఉంది. తొలి విడత సేకరించిన 54 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ? ఐకానిక్ సముదాయాల నిర్మాణాలేవి? రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాల్లో 29 వేల మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతేంటి? 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అయినా నిర్మాణం జరిగిందా? కళ్ళముందు సింగపూర్, జపాన్, డిల్లీ నగరాలు కనిపిస్తున్నట్లు, అమరావతి విశ్వనగరంలో ఇక భూములు లేనట్లు అప్పుడే రెండో విడత 16 వేల ఎకరాల భూ సేకరణ మొదలు పెడతారా? ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాకుంటే మరేంటి? అని వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు.

అదానీ, అంబానీకి బాకీ పడ్డారని భూములు సేకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. ముంబాయి ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాలు.. భోగాపురం 2200 ఎకరాలు.. మరి అమరావతికి 5 వేల ఎకరాలు ఎందుకు? బీజింగ్, లండన్‌లలో ఒలంపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల విస్తీర్ణమే. మరి అమరావతి స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు ఎందుకు? గడిచిన 11 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీల కోసం భూములు అంటే నమ్మశక్యమేనా? అని అనుమానం వ్యక్తం చేశారు.

రాజధాని భూములపై వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలి. మలివిడత భూ సేకరణపై అనుమానాలను నివృత్తి చేయాలి. అఖిలపక్షాన్ని వెంటనే పిలవాలి. అమరావతి విశ్వనగరం అవ్వాలనేది మా ఆకాంక్ష. తొలివిడతలో సేకరించిన భూముల్లో రాజధాని కట్టకుండా మలి విడత భూములు ఇవ్వాలని, లేకుంటే మున్సిపాలిటీ అవుతుందని రైతులను బ్లాక్ మెయిల్ చేయడం దారుణం. ఇది భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులను మోసం చేయడమే. రెండో విడత భూ సేకరణను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రాజధానికి లక్ష కోట్ల అప్పులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతి నిర్మాణం కేంద్రం భాద్యత. రాజధాని విభజన హామీ. స్వయంగా కేంద్ర ఆర్ధిక మంత్రి రాష్ట్రానికి వస్తే, రాజధానికి సహాయం అడగాల్సిన పేరు శాలువాలు కప్పి, ఆహా ఓహో అని డప్పు కొడతారా ? అమరావతి పేరుతో చేసే అప్పులు జీవితాలలో తీరేవేనా? అని అడిగారు. షర్మిల ట్వీట్

Next Story