- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. YS షర్మిల సంచలన ప్రకటన
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) సీరియస్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ స్టీల్ ప్లాంట్(Visakhapatnam Steel Plant)లో కార్మికులను తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని షర్మిల సంచలన ప్రకటన చేశారు. ‘ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ స్థాపించబడింది. కాంగ్రెస్ హయాంలో ప్లాంట్ లాభాల్లో ఉండేది. బీజేపీ ప్రభుత్వం రాగానే నష్టాలు అంటూ అందరినీ మోసం చేస్తున్నారు. ప్లాంట్ అభివృద్ధికి రూ.11వేల కోట్లు ఇచ్చినట్లు కేంద్రం చేసిన ప్రకటనలు అన్నీ పచ్చి అబద్ధం. ఇచ్చినట్లే ఇచ్చి రూ.8వేల కోట్లు బ్యాంక్ రుణాల కింద వెనక్కి తీసుకున్నారు. మరో రూ.3వేల కోట్లు ఇవ్వాలంటే 5వేల మంది ఉద్యోగులను తొలగించాలని కండీషన్ పెట్టారు.
స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసి అదానీకి అప్పగించాలని అనుకుంటున్నారు. అయినా కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుంది. సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కి ఇది న్యాయమా? ప్రధాని మోడీ(PM Modi)కి మీరు ఊడిగం చేస్తున్నారా?’ అని షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. మోడీతో లాలూచీ పడ్డారా? అని అడిగారు. ఇంత మోసం జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటారేమో.. మేము ఊరుకోం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను షర్మిల హెచ్చరించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్ అమ్మేస్తుంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. కార్మికుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఆంధ్రుల హక్కు- విశాఖ ఉక్కు నినాదంతో @INCIndia కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో స్టీల్ ప్లాంట్ స్థాపించబడింది.… pic.twitter.com/DJmuYzs6ZB
— YS Sharmila (@realyssharmila) May 21, 2025






