- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మోడీ మెప్పు కోసం ఇంత దిగజారుడు తనమా?.. రాష్ట్ర ప్రభుత్వంపై YS షర్మిల సంచలన వ్యాఖ్యలు
విశాఖ(Vizag) వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై(Yoga Day celebrations) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ(Vizag) వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవాలపై(Yoga Day celebrations) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘కూటమి ప్రభుత్వానికి పైత్యం పరాకాష్టకు చేరింది. యోగాంధ్ర గిన్నిస్ రికార్డుల కోసం పసి బిడ్డలను అవస్థలు పెడతారా? తిండి తిప్పలు లేకుండా కడుపులు మార్చుతారా? వేలమంది బిడ్డలను రూముల్లో వేసి కుక్కుతారా? వాళ్లను పిల్లలు అనుకున్నారా.. గొర్రెలనుకున్నారా? ఆ బిడ్డలు గిరిజన బిడ్డలనే కదా ఈ ప్రభుత్వానికి చిన్నచూపు. ఏం చేసినా నోరు మెదపరనే కదా ఈ నిర్లక్ష్యం. మోడీ మెప్పు కోసం ఇంత దిగజారుడు తనమా?. కూటమి ప్రభుత్వానికి ఇది నిజంగా సిగ్గుచేటు. గిన్నిస్ రికార్డ్ యోగాంధ్రకు కాదు.. 27 వేల మంది గిరిజన విద్యార్థులకు ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలి.
ఇక హంతకులు శ్రీరంగ నీతులు చెప్తే ఎలా ఉంటుందో ఇవాళ మోడీ(Modi)ని చూస్తే అర్ధమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణం తీస్తూ, కార్మికుల పొట్ట కొడుతూ, మానసిక క్షోభకు గురి చేస్తూ, ఆరోగ్యం కోసం యోగా చేయమని అదే విశాఖలో మోడీ చెప్పడం విడ్డూరం. 6 నెలల్లో 2 సార్లు విశాఖలో పర్యటించిన మోడీకి స్టీల్ ప్లాంట్ సమస్య కనిపించదు. కార్మికుల ఆవేదన వినిపించదు. ఆదుకుంటామని, ప్రైవేటీకరణ లేదని చెప్పే దమ్ము బీజేపీకి లేదు.
విభజన హామీలపై ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతుంటే, రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో రూ.300 కోట్లు ఖర్చు పెట్టి యోగాంధ్ర చేయమని ఎవరడిగారు? చేసిన మోసాలు చాలవన్నట్లు ఏ మొహం పెటుకొని మోడీ రాష్ట్రానికి వచ్చారు? విభజన హామీలు ఏమయ్యాయి? తిరుపతి వేదికగా హామీలు ఇచ్చి పదేళ్లు దాటింది. ప్రత్యేక హెూదా హామీ ఇచ్చారు. ఢిల్లీని తలదన్నే రాజధాని అన్నారు. పోలవరం నిర్మించే బాధ్యత నాదే అంటూ గొప్పలు చెప్పారు. సైలెంట్‌గా హెూదా అటకెక్కించారు. ఎత్తు తగ్గించి పోలవరం ప్రాజెక్ట్‌ను ముంచారు. రాజధానికి రూ.15 వేల కోట్లు అప్పు రూపంలో ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ లేదు. ఇండస్ట్రియల్ కారిడార్లు కట్టనేలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విభజన హామీలపై మోడీ మోసాలు రాస్తే రామాయణం.. వింటే మహాభారతం. సక్రమ, అక్రమ పొత్తులు, దత్తపుత్రుల అండదండలు ఉన్నంత కాలం రాష్ట్రంలో మోడీ ఆడింది ఆట.. పాడింది పాట’ అని ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ పెట్టారు. ట్వీట్






