- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila:ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వం పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం పై ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం(Polavaram)పై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని షర్మిల విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టును ఉద్ధరిస్తున్నామని అన్ని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. జీవనాడి లాంటి పోలవరంలో జీవం తీసి కుట్రపూరితంగా జీరో చేశారని పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తు 45.7 మీటర్ల నుంచి 41.15కు తగ్గించారని ఆరోపించారు. నీటి నిల్వ సామర్థ్యం 119.4 TMCలకు కుదించి బహుళార్థ సాధక ప్రాజెక్టు కాస్త బ్యారేజీ గా మార్చారని విమర్శించారు. R&R ప్యాకేజీని ఎగ్గొట్టేందుకు పోలవరాన్ని మొత్తంగా చంపేశారు. కేవలం రూ.22 వేల కోట్ల మిగులు కోసం రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ(BJP) ఘోరంగా దెబ్బతీస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే కుడి, ఎడమ కాలువలకు సహజంగా నీరు పారదనే నిపుణుల హెచ్చరికలు బేఖాతర్ చేస్తున్నారంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎత్తు తగ్గింపుతో ప్రాజెక్టుకు తీవ్ర నష్టం జరుగుతుంటే.. కూటమి ప్రభుత్వాని(AP Government)కి రాష్ట్ర ప్రయోజనాల కన్నా పీఎం నరేంద్ర మోడీ(PM Narendra Modi) గారి ప్రయోజనాలే ఎక్కువయ్యాయని అన్నారు. నీటి నిల్వ ఎత్తు తగ్గింపు పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) తీరు చూస్తుంటే "జంకు లేని బొంకు తత్వం" అన్నట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. బనకచర్ల మీదున్న ప్రేమ బాబు గారికి పోలవరం మీద లేదు. అనుసంధానం అనుమతుల మీద పెట్టిన శ్రద్ధ పోలవరానికి పూర్తిస్థాయి నిధుల సాధన మీద పెట్టడం లేదని పేర్కొన్నారు.
పార్లమెంట్ వేదికగా 41.15 మీటర్ల నీటి నిల్వ ఎత్తు వరకే నిధులు పరిమితం చేస్తామని బీజేపీ చెబుతుంటే.. నిలదీసే దమ్ము కూటమిలోని టీడీపీ, జనసేన సభ్యులకు లేదు. పోలవరానికి శుభవార్త చెప్తామంటూ ఈ నెల(మే) 28న సమీక్ష చేస్తున్నా ప్రధాని మోడీని వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ‘‘జాతీయ ప్రాజెక్టుగా పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. ప్రాజెక్టు నిర్మాణంలో ఫేజ్ 1, ఫేజ్ 2లు మాకొద్దు. మొదటి DPR ప్రకారం నీటి నిల్వ సామర్థ్యం 45.7 మీటర్ల ఎత్తుకు ప్రాజెక్టు నిర్మాణం ఇప్పుడు జరగాల్సిందే. ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 194.6 టీఎంసీలుగా ఉండాల్సిందే. పోలవరం ద్వారా 30 లక్షల ఎకరాలకు సాగునీరు, 28.50లక్షల మందికి తాగునీరు ఇవ్వాల్సిందే. 45.7 మీటర్ల ఎత్తు ప్రకారం R&R ప్యాకేజీలో మిగిలిన 94 వేల కుటుంబాలకు 100 శాతం పరిహారం ఇవ్వాలని’’ ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.






