- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంగవీటి రంగా జయంతి.. పవన్ కల్యాణ్‌కు YS షర్మిల కీలక విజ్ఞప్తి
కాంగ్రెస్ పార్టీ మాజీ శాసన సభ్యులు, ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) 78వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నివాళులు అర్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ మాజీ శాసన సభ్యులు, ప్రజా నాయకులు వంగవీటి మోహన రంగా(Vangaveeti Mohana Ranga) 78వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) నివాళులు అర్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పేదల పక్షపాతిగా, పేదల అభ్యున్నతి ధ్యేయంగా, తుది శ్వాస వరకు పేదల పక్షాన పోరాటం చేసిన గొప్ప నేత రంగా. ఆయన జ్ఞాపకార్థం విజయవాడ పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. నేడు రంగా జయంతి సందర్భంగా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు గుర్తు చేస్తున్నాం. కాజ టోల్ గేట్ నుంచి చిన్న అవుటుపల్లి పల్లి వరకు 47.8 కి.మీ ఉన్న బైపాస్ రహదారికి వంగవీటి మోహన రంగా జాతీయ రహదారిగా పేరు పెట్టండి’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






