రాఖీ పండుగ వేళ YS షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

రాఖీ పండుగ(Rakhi Festival) వేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాఖీ పండుగ వేళ YS షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాఖీ పండుగ(Rakhi Festival) వేళ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు ప్రతీక రక్షా బంధన్. రాష్ట్రంలోని ప్రతి అన్నకు, తమ్ముడికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్ని బంధాల కన్నా రక్త సంబంధం గొప్పది. నాతో రక్త సంబంధం లేకపోయినా, YSR అనే మూడక్షరాల అనుబంధాన్ని రక్త సంబంధంగా ఏర్పరుచుకొని నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రతి అన్న, తమ్ముడు సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య సోదర బంధం కూడా రాజకీయ, వ్యక్తిగత కారణాలతో బలహీనమైన విషయం తెలిసిందే. షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన తర్వాత, జగన్‌తో ఆమెకు కాస్త గ్యాప్ వచ్చింది. దీంతో 2024 నుంచి షర్మిల జగన్‌కు రాఖీ కట్టలేదు. 2025లో అయినా ఈ సంప్రదాయం కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.

Next Story