మోడీకి జగన్‌ దత్తపుత్రుడు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు.

మోడీకి జగన్‌ దత్తపుత్రుడు.. షర్మిల ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో పాల్గొని MGNREGA మార్పులను తీవ్రంగా విమర్శించారు. గాంధీ పేరును తొలగించడం, పేదల హక్కులపై కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా పోరాటం ప్రకటించారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా కీలక పోస్టు పెట్టారు.

‘ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వాళ్ళే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై అధికారంలో ఉండగా నిద్రపోయి, NGT వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం వద్ద అనుమతుల కోసం ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని YCP ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు. 5 ఏళ్ళు మోడీకి దత్తపుత్రుడుగా వ్యవహరించిన జగన్‌కి సీమకు నీళ్లు ఇవ్వాలని గుర్తుకు రాలేదా? జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి రాయలసీమ ప్రాజెక్టులపై కన్నెత్తైనా చూశారా? ఇప్పుడు నిద్రలేచి ఆందోళనలు అనడం సిగ్గుచేటు. చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద కడతారట. ఎవరిని మోసం చేయడానికి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు? మోడీ దగ్గర సాగిలపడి ఇద్దరు కలిసి సీమకు అన్యాయం చేస్తారా?’ అని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story