- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ విపత్తుగా ప్రకటించాలి: షర్మిల డిమాండ్
మొంథా తుపాను(Cyclone Montha) రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: మొంథా తుపాను(Cyclone Montha) రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పేర్కొన్నారు. శనివారం కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల కేంద్రంలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా పంటనష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. జరిగిన నష్టంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మొంథా ప్రభావంతో ఒక్క బంటుమిల్లి మండలంలోనే సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగి నేలకొరిగింది. రైతన్న ప్రతి ఎకరాకు దాదాపు రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే, పంట చేతికొచ్చి సమయంలో తుపాను సర్వనాశనం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజక వర్గంలో చూసినా భారీగా జరిగిన నష్టమే కనిపిస్తోంది.
ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా తమ పొలాల్లోకి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే, దాదాపు రూ.20 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లితే, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం ఇవ్వలేక నష్టాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. వ్యవసాయానికి కేవలం రూ.8 వందల కోట్లు మాత్రమే నష్టం అని చెప్పడం దారుణం. ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదు. జరిగిన నష్టంపై వెంటనే మళ్ళీ గ్రౌండ్ లెవెల్ అంచనా జరగాలని, నష్టపోయిన ప్రతి రైతుకి కౌలు రైతును కూడా కలుపుకొని ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించాలని, కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి నిధులు విడుదల చేయాలని, ఉచిత పంట బీమా పథకాన్ని తిరిగి అమలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






