‘ఆ జిల్లాల్లో ఎక్కడ చూసిన తడిసిన ధాన్యమే’.. వైఎస్ షర్మిల ఆవేదన

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-05 14:22:05  IST  )

రాష్ట్రంలో నిన్న(ఆదివారం) కురిసిన అకాల వర్షాల వలన అస్థి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఆ జిల్లాల్లో ఎక్కడ చూసిన తడిసిన ధాన్యమే’.. వైఎస్ షర్మిల ఆవేదన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిన్న(ఆదివారం) కురిసిన అకాల వర్షాల వలన అస్థి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగిందని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా తడిసిన ధాన్యం, రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపిస్తుందన్నారు. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. కానీ.. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా తీయకపోవడం గమనార్హం అన్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా తడిసిన ధాన్యమే కనిపిస్తోందన్నారు. ఈ సారి దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం కొన్నది మాత్రం కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులే అని తెలిపారు. ఇంకా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే ఉంది.

ప్రభుత్వం కొనుగొలు చేయాల్సింది పోయి టార్గెట్ ముగిసిందని RSK కేంద్రాలు బంద్ పెట్టారని మండిపడ్డారు. విదేశాల్లో డిమాండ్ లేదని మిల్లర్లు కూడా కొనడం లేదు. పొలాల్లో వరి కుప్పలు పోసి రైతులు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి? చివరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమైంది? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మిల్లర్లు తక్కువ రేటుకు కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితి ఏర్పడితే.. నేరుగా అక్కడి ప్రభుత్వం విదేశాలకు నేరుగా బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుందని ఆమె తెలిపారు. ఫిలిప్పీన్స్,మలేషియా దేశాలతో నేరుగా తెలంగాణ ప్రభుత్వం MOU చేసుకుందని వెల్లడించారు.

ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద ఒత్తిడి చేయకుండా.. నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా? మీ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం కావాలా? అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో మిరపకి 11781 మద్దతు ధర ఉంటే... 6 నుంచి 9 వేల ధర దక్కలేదు. పత్తి పంటకు 7521 మద్దతు ధర ఉంటే.. గరిష్టంగా 5 వేలు కూడా అందలేదు. వేరుశెనగ కి 6783 రూపాయలు మద్దతు ధర ఉంటే.. గరిష్టంగా 5 వేలు దక్కలేదు. జొన్న పంటకు 3371 మద్దతు ధర ఉంటే.. గరిష్ట ధర 2500 కూడా రైతుకు అందలేదు. కంది పంటను మద్దతు ధర కన్నా 2 వేల రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది.

పెసరకు క్వింటాకు రూ.3,600 నష్టానికి, మినుము 14,00 నష్టానికి, మొక్క జొన్న రూ.250 నష్టానికి అమ్ముకున్నారు. పొగాకు రైతుకు 13 వేల నష్టానికి రైతు అమ్ముకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. రైతులకు మద్దతు ధర హక్కు అని చెప్పారు. ఎక్కడ దక్కుతుంది రైతులకు ఆ హక్కు? రైతులను దగా చేస్తూ.. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చారు. ధరల స్థిరీకరణ కింద 6 వేలు ఇప్పటి వరకు ఖర్చు చేశారట? ఇదంతా పచ్చి అబద్ధాలని వైఎస్ షర్మిల ఆరోపించారు.

Next Story