తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్‌...వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌

by velandi.Saikiran |   (  Updated:2025-12-03 11:26:12  IST  )

తెలంగాణ‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌

తెలంగాణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్‌...వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: తెలంగాణ‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ కౌంట‌ర్ ఇస్తున్నారు. ఇక తాజాగా ఈ వివాదంపై వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న ట్వీట్ చేశారు. కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలిందంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడటం బాధాకరం అంటూ పోస్ట్ పెట్టారు. ఇలాంటి మాటలు ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చ గొట్టడమే అంటూ నిప్పులు చెరిగారు. ఇది పవన్ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని మండిప‌డ్డారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ష‌ర్మిల‌.

అన్నదమ్ముల్లాంటి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దని కోరారు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోతే, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి మీద రుద్దడం సరికాదని చుర‌క‌లు అంటించారు. మూఢ‌ నమ్మకాలను అడ్డంపెట్టుకుని ప్రజలను కించపరచడం ఉప ముఖ్యమంత్రిగా మీకు సబబు కాదని ఆగ్ర‌హించారు. కోనసీమ కొబ్బరిచెట్టుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉప్పునీటి ముప్పును తప్పించండని కోరారు. కొబ్బరి రైతుల కష్టాలకు తక్షణ పరిష్కారం చూపండని డిమాండ్ చేశారు. రూ.3500 కోట్లు వెంటనే కేటాయించి పనులు మొదలు పెట్టండన్నారు ష‌ర్మిల‌.

Next Story