- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూరియా కొరత కృత్రిమ సంక్షోభం.. సీఎం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్
ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై వైఎస్ షర్మిల స్పందించారు. దీనిపై సీఎం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు తీవ్రమైన యూరియా కొరత ఎదుర్కొంటున్నారు. బ్లాక్ మార్కెట్లో డబుల్ రేట్లకు యూరియా కొనలేక, రాయితీపై యూరియా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అధికార పార్టీ నేతలు సృష్టిస్తోన్న కృత్రిమ సంక్షోభం అని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఒక యూరియా బస్తాను రూ.266కు అమ్మాల్సి ఉండగా.. మార్కెట్లో రూ.500కు అమ్ముతున్నారని, ఇదంతా పెద్ద దందా అని ఆరోపించారు.
రాష్ట్రానికి ఇప్పటికే 6.34 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా చేరితే ఆ నిల్వలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు అందించాల్సిన యూరియాను అక్రమంగా గోదాములకు తరలించి.. కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. తెల్లవారకముందు నుంచే యూరియా కోసం రైతులు క్యూ కట్టినా.. రైతు సేవా కేంద్రాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఈ సంక్షోభంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. యూరియాను అక్రమంగా నిల్వచేసిన వారిపై ఈసీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.






