అది రాజ్యాంగ విరుద్ధం: వక్ఫ్ బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-03 12:15:29  IST  )

వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ షర్మిల అన్నారు...

అది రాజ్యాంగ విరుద్ధం: వక్ఫ్ బిల్లుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill) రాజ్యాంగ విరుద్ధమని వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. అది భారత దేశ ఐక్యతపై జరిగిన దాడి అని అభివర్ణించారు. వక్ఫ్ భూములు కాజేసేందుకే ఈ సవరణ బిల్లు అని షర్మిల విమర్శించారు. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మతస్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లుతో మైనార్టీలను అణచివేసే కుట్రకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. దేశ చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగులుతుందని షర్మిల విమర్శించారు. .

మరోవైపు వైఎస్ వివేకానందారెడ్డి హత్య(Ys Vivekananda Reddy)పైనా షర్మిల స్పందించారు. ఆ కేసులో వరుసగా సాక్షులు చనిపోతున్నారని చెప్పారు. సునీత ప్రాణాలకు ముప్పు ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. సునీతకు ఇద్దరు పిల్లలున్నారని, ఆమె ప్రాణాలకు రక్షణ లేదని తెలిపారు. ఈ కేసు నిందితుడు అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటకు వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య కేసులో వైఎస్ సునీత(Ys Sunitha)కు ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం తనకు కలుగతోందని షర్మిల తెలిపారు.

Next Story