NDA పక్షాన నిలబడినందుకు జగన్ సిగ్గుపడాలి: వైఎస్ షర్మిల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-18 10:57:48  IST  )

దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని, బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని వైఎస్ షర్మిల అన్నారు...

NDA పక్షాన నిలబడినందుకు జగన్ సిగ్గుపడాలి: వైఎస్ షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్: దత్తపుత్రుడు జగన్ తెర తొలగిందని, బీజేపీతో పెట్టుకున్న అక్రమపొత్తు తేటతెల్లమైందని వైఎస్ షర్మిల అన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏకు మద్దతుగా నిలబడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం ముసుగులో ఉన్నది సైతం RSS పక్షమేనని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. TDP, జనసేనల కంటే మోడీని ఇంతలా మోయాలా? అని షర్మిల ప్రశ్నించారు. మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా? అని, అక్రమ డీ లిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడినందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ సిగ్గుపడాలని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలా బీజేపీతో అంటకాగాలా? అని ప్రశ్నించారు. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా? అని నిలదీశారు. బీజేపీ బిల్లులకు గొర్రెలా గుడ్డిగా తలాడించాలా? అని, మోడీ మెప్పుకోసం సొంత కాకిలెక్కలు అల్లాలా? అని అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

‘‘ఇదేనా మీరు చెప్పే YSR ఆశయాలు, వారసత్వం ? మహానేత సిద్ధాంతాలను మంట గలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే, ఏం సాధించారని ప్రశ్నించడం తీవ్ర హాస్యాస్పదం. దొంగ బిల్లులకు ఓటేసి ఇంతకు మీరేం సాధించారు? కోట్లాది AP రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమా మీరు సాధించిన గొప్పతనం. దక్షిణాది రాష్ట్రాల బావోగ్వేదాన్ని అర్థం చేసుకోకపోవడమా మీ రాజకీయం?. ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా?. జగన్ చేసిన నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది.’’ అని షర్మిల మండిపడ్డారు.

వాళ్లకు పట్టిన పరిస్థితే చంద్రబాబుకు.. రేవంత్‍రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

Next Story