తక్షణమే ఉపసంహరించుకోండి: ప్రభుత్వానికి వైఎస్ షర్మిల వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-29 12:25:06  IST  )

గోరంత చేసి కొండంత చెప్పుకోవడం సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు...

తక్షణమే ఉపసంహరించుకోండి: ప్రభుత్వానికి వైఎస్ షర్మిల వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: గోరంత చేసి కొండంత చెప్పుకోవడం సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ప్రజలపై రూ.15,780 కోట్లు ట్రూ అప్ భారం మోపారని విమర్శించారు. ఇప్పుడు ట్రూ డౌన్‌తో తగ్గిన భారం కేవలం రూ.923 కోట్లు అని వ్యాఖ్యానించారు. 2024- 25 వార్షిక సంవత్సరానికి సర్దుబాటు పేరుతో అదనంగా దోచిన రూ.923 కోట్లను ERC తిరిగి చెల్లించలేదని తెలివపారు. మొట్టికాయలు వేస్తే అదేదో కూటమి ప్రభుత్వం ఛార్జీలు తగ్గించిందని వినియోగదారులకు భారీ ఉపశమనం ఇచ్చామని, సమర్ధత, అనుభవం అని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల్లో ఛార్జీల తగ్గింపు హామీని నిలబెట్టుకున్నామని ప్రకటించుకోవడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ అని షర్మిల పేర్కొన్నారు.

నిజంగా చంద్రబాబు(Chandrababu)కి విద్యుత్ చార్జీల(Electricity charges)పై చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండని నిలదీశారు. అమలవుతున్న ఛార్జీల్లో 30 శాతం మేర ఛార్జీలు తగ్గిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని సూచించారు. అదనంగా విధించిన రూ.15 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీల భారాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.

Next Story