- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడప ఎంపీ టికెట్ కోసమే వివేకా హత్య: వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
కడప ఎంపీ టికెట్ కోసమే వివేకాను హత్య చేశారని వైఎస్ షర్మిల అన్నారు. వివేకా హత్య కేసులో అన్యాయం జరిగిందని వైఎస్ సునీత ఆరోపించిన నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: కడప(Kadapa) ఎంపీ టికెట్ కోసమే వివేకా(Viveka)ను హత్య చేశారని వైఎస్ షర్మిల(Ys Sharmila) అన్నారు. వివేకా హత్య(Viveka Murder) కేసులో అన్యాయం జరిగిందని వైఎస్ సునీత(Ys Sunitha) ఆరోపించిన నేపథ్యంలో ఎంపీ అవినాశ్ రెడ్డి(Mp Avinash Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కడప ఎంపీ పదవికి అవినాశ్ సరికాదని తన బాబాయ్ వివేకానందరెడ్డి చెప్పారని వైఎస్ షర్మిల వెల్లడించారు. కడప ఎంపీ టికెట్ అవినాష్‌రెడ్డికి ఇవ్వొద్దని జగన్‌కు వివేకా చెప్పారని, కానీ వినలేదని తెలిపారు. వివేకా బతికి ఉంటే ఎప్పటికైనా తనకు అడ్డు తప్పదని అవినాశ్ రెడ్డి భావించారని షర్మిల తెలిపారు. వివేకానందారెడ్డిని సునీత భర్త హత్య చేసినట్టు అవినాశ్‌రెడ్డి చిత్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. వివేకాను సునీత భర్త సొంత తండ్రిలా చూసుకునేవారని చెప్పారు.
‘‘వివేకాకు గుండెపోటు వచ్చిందని సాక్షి మీడియాతో ప్రచారం చేయించారు. అంతేకాదు ఆ హత్యను టీడీపీ పనే అని జగన్ చెప్పించారు. వివేకా హత్యపై జగనే సీబీఐ విచారణ కోరారు. వివేకా హత్యపై దుష్ప్రచారం చేసి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. జగన్‌కు అధికారం వచ్చిన సునీత ఎన్నిసార్లు కోరినా సీబీఐ విచారణకు ఒప్పుకోలేదు. కోర్టు ఆదేశాలతో వివేకా హత్యపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. సునీత చేస్తున్న ఎంక్వైరీ సీబీఐ ఎందుకు చేయట్లేదు. జగన్ ఐదేళ్లు అధికారంలో ఉండగా వివేకా హత్య కేసు ఎందుకు కొలిక్కి తీసుకురాలేదు. అన్న అనే పదానికి జగన్ కళంకం. వివేకా హత్యపై సునీత ఒంటరి పోరాటం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం న్యాయం చేయకపోవడం వల్లే సునీతకు కర్మ పట్టింది. సీబీఐ, బీజేపీ సైతం అన్యాయం చేస్తున్నాయి. ఆడబిడ్డ కోసమైనా న్యాయం చేయాలని బీజేపీ, సీబీఐని అడగాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదా.?’’. అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.






