- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఓట్ చోర్ క్యాంపెయిన్.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
రాహుల్ ఓట్ చోర్ క్యాంపెయిన్‌ను రాష్ట్రంలో ప్రతి గడపకు చేరుస్తామని వైఎస్ షర్మిల తెలిపారు...

దిశ, వెబ్ డెస్క్: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ(Rahul Gandi) ప్రారంభించిన ఓట్ చోర్ క్యాంపెయిన్(Vote Chor Campaign)ను ఆంధ్రప్రదేశ్(AndraPradesh)లో సైతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గడపకు చేరుస్తామని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(Ys Sharmila) తెలిపారు. ఓట్ల దొంగ మోడీ(Modi) తీరును, బీజేపీ(Bjp) కోసం అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడతామని ఆమె పేర్కొన్నారు. ECI స్వతంత్ర వ్యవస్థే అయితే, ప్రజాస్వామ్యం ECకి ముఖ్యం అనుకుంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలకు బదులివ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ‘‘డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?... CCTV ఆధారాలు ఎందుకు నాశనం చేశారు ?. నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారు అయింది?. ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు..?. బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?’’ అని రాహుల్ గాంధీ అడుగుతున్న పశ్నలకు ECI వెంటనే సమాధానం చెప్పాలని షర్మిల నిలదీశారు.
దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థ భ్రష్టుపట్టింది. దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్‌నే కలుషితం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపు కాయాల్సిన EC.. మోడీ కాపు కాస్తోంది. ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉంది. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది. ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో EC కూడా భాగమైంది. ఇవ్వాళ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే "ఎలక్షన్ చోర్ కమిషన్". మోడీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం. రాహుల్ గాంధీ బయటపెట్టిన నిప్పు లాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారు.’’ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.






