ఎక్కడ చూసినా బీభత్సం.. తుపాను నష్టంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన

by Vemula.Srinu Prasad |

మొంథా తుపాను రైతులు సర్వం కోల్పోయారని వైఎస్ షర్మిల అన్నారు. ..

ఎక్కడ చూసినా బీభత్సం.. తుపాను నష్టంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: మొంథా తుపాను(Montha Storm) కారణంగా రైతులు సర్వం కోల్పోయారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress State Chief Ys Sharmila) అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వరద నష్టాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను బీభత్సం సృష్టించిందని, ఎక్కడ చూసినా పంటలు నేలమట్టం అయ్యాయన్నారు. అసలే రాష్ట్ర రైతులు అప్పుల్లో ఉన్నారని, ఇప్పుడు తుపాను మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం అపారంగా జరిగితే ప్రభుత్వం తక్కువ చేసి చూపించిందని, ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదన్నారు. నష్టం ఎక్కువ జరిగిందని చెప్తే పరిహారం ఎక్కువ ఇవ్వాలని అనుకున్నారేమోనని పేర్కొన్నారు. అంచనాలకు జరిగిన నష్టానికి పొంతన లేదని, ప్రభుత్వ లెక్కల ప్రకారం కేవలం 8 వందల కోట్లు మాత్రమే వ్యవసాయానికి నష్టమట అని ఎద్దేవా చేశారు.

‘‘ప్రభుత్వ ప్రాథమిక అంచనా పూర్తిగా అవాస్తవం. ఎక్కడ రైతులను పలకరించినా ఇది అబద్ధం అంటున్నారు. అసలు సర్వే జరగలేదని చెప్తున్నారు. రైతుల దగ్గరకు వెళ్ళి అసలు పంట నష్టం అంచనా వేయలేదు. కాంగ్రెస్ పార్టీ అంచనా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేవలం వరి పంట 13 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. ప్రత్తి పంట 3 లక్షల ఎకరాలలో పనికి రాకుండా పోయింది. వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగింది. తుపాను కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం జరిగింది.’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో రైతులు తీర్వ ఇబ్బందుల్లో ఉన్నారని, కూటమి పాలనలో పండిన పంటకు సైతం గిట్టుబాటు లేదని షర్మిల విమర్శించారు. ‘‘ఒక్కో ఎకరాకు రైతు దాదాపు 35 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మొత్తం పోయిందని బాధపడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి ఇంత నష్టం జరిగితే మోడీ గారు నోరు విప్పలేదు. మోడీ రాష్ట్రానికి వస్తారు పోతారు. కానీ రాష్ట్ర సమస్యల మీద మాత్రం మాట్లాడరు. ఇప్పటికే రాష్ట్ర హక్కుల మీద అన్ని రకాలుగా మోసం చేశారు. మోడీకి మోసం చేయడం అలవాటు‌గా మారితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చూసి మురిసిపోతున్నారు. ఆంధ్రా ప్రజలు అధికారం ఇస్తే మోడీకి రాష్ట్ర సమస్యలు కనపడవు. ఒక్కసారిగా కూడా ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఆంధ్ర రాష్ట్ర అంటే కేవలం ఓట్లు మాత్రమే.’’ అని షర్మిల విమర్శించారు.

Next Story