- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరి మీకెలా చెప్పాలి బుద్ధి?: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన షర్మిల
ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరేనని.. మరి రంజాన్‌తోఫా సంగతేంటి చంద్రబాబు? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు....

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఇఫ్తార్ విందులు(Government Iftar Dinners) సరేనని.. మరి రంజాన్‌తోఫా(Ramadan Tofa) సంగతేంటి చంద్రబాబు(Chandrababu)? అని వైఎస్ షర్మిల(Ys Sharmila) ప్రశ్నించారు. అధికారం ఇచ్చిన వెంటనే చంద్రన్న తోఫా(Chandranna Tofa) అన్నారు కదా? అని ఆమె గుర్తు చేశారు. పేద ముస్లింల(Poor Muslim)కు భరోసా అని చెప్పారు కదా? అని నిలదీశారు. రెండేళ్లుగా తోఫాపై తొండి ఏంటి? అని మండిపడ్డారు. 12 లక్షల కుటుంబాలకు తోఫా ఇవ్వడానికి నిధులు లేవా? అని వ్యాఖ్యానించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్‌లో రంజన్ తోఫాకు 65 కోట్లు బరువా? అని ప్రశ్నించారు. తోఫా ఇవ్వనందుకు జగన్‌కి ముస్లింలు బుద్ధి చెప్పారని విమర్శించారు. మరి మీకెలా చెప్పాలి బుద్ధి అని నిలదీశారు.
మైనారిటీ సంక్షేమం అంతా బూటకం
‘‘కూటమి ప్రభుత్వం చెప్పే మైనారిటీ సంక్షేమం అంతా బూటకం. చంద్రబాబు ప్రధాని మోడీకి వణుకుతున్నారు. బీజేపీకి గులాం గురి చేస్తున్నారు. RSS భావజాలానికి అలవాటు పడ్డారు. మైనారిటీ సంక్షేమానికి నిధులిస్తే తమ సంక్షేమం కట్ అవుతుందని భయపడుతున్నారు. అందుకే రంజన్ తోఫాపై మాట మార్చారు. చంద్రబాబుకి మైనారిటీల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాను పంపిణీ చేయాలి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






