- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YS Sharmila | పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు
ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు అని రాష్ట్ర కాంగ్రెస్ (Congress) చీఫ్ వైయస్ షర్మిలా అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని కూటమి ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తోంది పంచ సూత్రాలు కాదు.. పంచ మోసాలు అని రాష్ట్ర కాంగ్రెస్ (Congress) చీఫ్ వైయస్ షర్మిలా అన్నారు. ఏపీ పరభుత్వం పంచ సూత్ర సంక్షేమం పేరిట బూటకానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఎక్స్ వేదికగా విమర్శల వర్షం కురిపించారు. 17 నెలలుగా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందన్నారు. రైతన్నలను అప్పుపాలు చేసిందని ఆరోపించారు. సాగుకు సమాధి కట్టి.. అన్నదాతలకు మేలు చేసేందుకు పంచ సూత్రాల రాగం అందుకోవడాన్ని తప్పుబట్టారు. రైతన్నా మీకోసం అంటూ వారి వద్ద వెళ్లేది కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు జరిగిన నష్టాన్ని ఎగ్గొట్టారని.. మద్ధతు ధర కల్పించకుండా మోసం చేశారని ఆరోపించారు. అన్నదాత సుఖీభవ పథకం కేవలం సగం మంది రైతులకే చేరిందన్నారు. ఇతర సబ్సిడి పథకాలకు స్వస్థి పలికారన్నారు. టమోటా, ఉల్లి, అరటి లాంటి పంటల ధర రూపాయికి కిలో పడిపోయిందని గుర్తు చేశారు. ధరల స్థిరీకరణకు నిధి పెట్టకుండా రాష్ట్ర ప్రబుత్వం కాలక్షఏపం చేస్తోందన్నారు. చివరకు ఎరువులు, విత్తనాలు కూడా ఇవ్వకుండా రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు.






