- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయమ్మకు అవమానం.. మంత్రి బొత్సపై షర్మిల ఆగ్రహం
సీఎం జగన్ కేబినెట్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ కేబినెట్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ను తిట్టిన వాళ్లే జగన్ కేబినెట్‌లో ఉన్నారని ఆమె ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఆమె బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ బొత్స సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తల్లి విజయమ్మను బొత్స అవమానించారనిగుర్తు చేశారు. జగన్‌ను ఉరితీయాలని కాంగ్రెస్ హయాంలో ఇదే బొత్స వ్యాఖ్యానించారని ఆమె మండిపడ్డారు. దివంగత వైఎస్సార్‌ను అసెంబ్లీలో బొత్స తిట్టి పోసిన విషయాన్ని జగన్ మర్చిపోయారన్నారు. జగన్‌కు బొత్స సమానులట అని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్ళకు జగన్ పెద్ద పీట వేశారని ఆరోపించారు. జగన్ కోసం పాదయాత్ర చేసిన వాళ్లు ఆయనకు ఏమీ కారటని అని షర్మిల సెటైర్లు వేశారు.
Next Story






