జగన్, చంద్రబాబు రాజీపడ్డారు: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-26 14:37:41  IST  )

జగన్, చంద్రబాబు రాజీపడ్డారని వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు..

జగన్, చంద్రబాబు రాజీపడ్డారు: వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajasekhar Reddy) కల పోలవరం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Congress Party State President YS Sharmila) అన్నారు. అయితే పోలవరం ఎత్తు విషయంలో బీజేపీ(Bjp)తో జగన్(Jagan), చంద్రబాబు(Chandrababu) రాజీపడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. పోలవరం నిర్వాసితులు షర్మిను కలిసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు ఎత్తులో కడతామని జగన్, చంద్రబాబు ఒప్పుకున్నారని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే భావనతోనే జగన్‌కు ముఖ్యమంత్రిగా ప్రజలు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును ఆరు నెలల్లోనే పూర్తి చేస్తామని, నవరత్నాల్లో పెట్టి మరీ జగన్ చెప్పారని షర్మిల గుర్తు చేశారు. తన ఐదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)ను పూర్తి చేయకపోగా.. ఎత్తు విషయంలో సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కూడాతామేమీ తక్కువ తినలేదనే విధానంలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే వైసీపీ, టీడీపీ(Tdp) నాయకుల్లో ఒక్కరు కూడా నోరు విప్పలేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story