నేను అడిగిన ప్రశ్నేంటి?.. మీరు చేస్తున్న ప్రచారమేంటి?: వైఎస్ షర్మిల సీరియస్

by Gantepaka Srikanth |

కూటమి ప్రభుత్వం(NDA Govt), సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నేను అడిగిన ప్రశ్నేంటి?.. మీరు చేస్తున్న ప్రచారమేంటి?: వైఎస్ షర్మిల సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వం(NDA Govt), సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘‘వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకునే 228 ఆడబిడ్డలకు ఒకటే బాత్ రూమ్ ఉందట. స్వయంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. హాస్టళ్లలో ఒకే రూంలో 17 మంది నేలమీదే నిద్రిస్తున్నారట. ఇది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన అంశమే. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? ఇదే విషయంపై ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించా. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగా. ఇందులో తప్పు ఏమైనా ఉందా? ఇవాళ కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత తాగునీటితో ఇద్దరు బిడ్డలు చనిపోయి, 128 మంది ఆసుపత్రుల పాలైన ఘటన ఇందుకు నిదర్శనం కాదా? బడి బాగుంటే ఈ దారుణం జరిగేదా? గుడితో పాటు బడి బాగుపడాలని అడగడం నేరమా? నేను అడిగిన ప్రశ్నకు మతం రంగు ఎందుకు పులిమారు? వ్యక్తిగతంగా నాకు అన్ని మతాలు సమానమే.

ప్రభుత్వ పెద్దలు మాత్రం ఒక మతానికి పెద్దపీట వేస్తున్నారు. మిగతా మతాల వారికి అభద్రతా భావం కలిగిస్తున్నారు. ఒక మతాన్ని అజెండాగా ఎత్తుకున్నారు. గుడులు కడతాం అంటే మజీదులు, చర్చ్‌లు కూడా కడతాం అని చెప్పాలి కదా? పురోహితులతో పాటు ఇమాంలు, ఫాస్టర్లకు ప్రభుత్వ సహాయం ఉండాలి కదా? ముఖ్యమంత్రిగా ఉండి అన్ని మతాలను సమానంగా చూడాలి కదా? మేము డిమాండ్ చేసింది ఒకటే.. దళితవాడల్లో, హాస్టల్లో బాత్ రూమ్‌లు లేవని.. హాస్టళ్లలో కనీస వసతులు లేవని. నేను మాట్లాడింది నేరంగా చూశారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిత్వ హననం చేశారు. మా అమ్మ, నాన్న, నా భర్త, బిడ్డలను దూషించారు. నా సంస్కారం మీద మాట్లాడే మీకు ఎక్కడ ఉంది సంస్కారం? ముగ్గురు బిడ్డల ప్రాణాలు తీయడం మీ సంస్కారమా ? కురుపాం బిడ్డల చావులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. హాస్టళ్ల గురించి నేను మాట్లాడితే... గుడికి టాయిలెట్ కి లింక్ పెట్టారు? అంత భయం ఎందుకు? లోపాలను ఎత్తి చూపిస్తే మతాల గురించి మాట్లాడటం మాని.. హాస్టల్స్‌ల్లో ముందు వసతులు కలిపించాలని’’ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ట్వీట్

Next Story