- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘వారికి విగ్రహాలు కట్టడం ఏంటి?’.. వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం
మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటన పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడం ఏంటని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌కు బానిసలైన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి? సమాజం ఎటు పోతుందని వైఎస్ షర్మిల నిలదీశారు. ఈ క్రమంలో ఆమె వైఎస్ జగన్‌కి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కానీ బల ప్రదర్శనలు కాదని సూచించారు. వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడు కాబట్టి.. అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్‌కి మాత్రమే ఆంక్షలు విధిస్తారని ఆమె మండిపడ్డారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవు ? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
మేము రాజధాని మీద పోరాటం చేయాలి అనుకుంటే హౌజ్ అరెస్ట్ చేస్తారు. స్టీల్ ప్లాంట్ కోసం చేసే దీక్షలు భగ్నం చేస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పరామర్శల పేరు మీద చేసే యాత్రలకు ఆంక్షలు ఉండవా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ మోడీ దత్త పుత్రుడు అని ఆంక్షలు పెట్టడం లేదా అని వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. జగన్ దగ్గర డబ్బులు ఉన్నాయానా? పోలీసులను సైతం కొనగలడా అని మండిపడ్డారు. జగన్ పరామర్శ లో ఇద్దరు చనిపోతే.. దానికి బాధ్యులు ఎవరని ఆమె సీఎం చంద్రబాబును నిలదీశారు. 100 మందికి అనుమతి ఇస్తే వేల మంది ఎలా వచ్చారని ఆమె ప్రశ్నించారు. పోలీసు శాఖ చూస్తూ ఎందుకు ఉంది. ప్రేక్షక పాత్ర డిపార్ట్‌మెంట్ ఎందుకు పోషించిందని ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది? జగన్ రాకముందే ఎందుకు వచ్చే జనాలను ఆపలేదు ? మీరంతా బీజేపీ మద్దతు దారులే అని ఆపకుండా ఉన్నారని ఆమె తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి నాయకుడిగా సమాధానం చెప్పాలి. బెట్టింగ్ లో చనిపోయిన వారికి విగ్రహాలు కట్టడం ఏంటి ? సమాజం ఎటు పోతుందని వైఎస్ షర్మిల నిలదీశారు. ప్రజా నాయకుడిగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి సూపర్ సిక్స్ ఏమయింది అని అడగాలి. రాజధాని మీద, పోలవరం మీద ఉద్యమాలు చేయాలి. ప్రత్యేక హోదా ఏమైంది అని అడగాలి అంతేగాని బలప్రదర్శనలు చేసి ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరు ఇచ్చారు? ఈ ఘటన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






