ఆమరణ దీక్ష చేస్తా: వైఎస్ షర్మిల సంచలన ప్రకటన

by Vemula.Srinu Prasad |

ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ దీక్ష చేస్తానని వైఎస్ షర్మిల హెచ్చరించారు..

ఆమరణ దీక్ష చేస్తా: వైఎస్ షర్మిల సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కొన్ని రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ(Ntr Health Services)లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వైద్య సేవలను వెంటనే కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Ys Sharmila) డిమాండ్ చేశారు. తన తండ్రి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీనే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగిస్తున్నారని, కానీ బకాయిలు పెట్టడాన్ని తాను తీవ్రంగా తప్పుబడుతున్నానని మండిపడ్డారు. ఆయా ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ(Aurogya Sri) పథకాన్ని స్టెచర్‌పైకి ఎక్కించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానని షర్మిల హెచ్చరించారు.

Next Story