- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నమ్మి ఓటేస్తే ఇంత షాకిస్తారా..?: ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రతిపాదనలను కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగనీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుంది తీరు అని ఆమె సెటైర్లు వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై APERC ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు హామీలకు పొంతనే లేదని ఎద్దేవా చేశారు.
ఓవైపు రూ.15651కోట్ల మేర ఛార్జీల వడ్డనకు నియంత్రణ మండలి సర్వం సిద్ధం చేసిందని చెప్పారు. బిల్లుల పెంపుపై ప్రజాభిప్రాయానికి ప్రకటన కూడా ఇచ్చేసిందని, ఇంకా చార్జీల భారం పడదని చంద్రబాబు చెబుతున్న మాటలు పాత చింతకాయ పచ్చడితో సమానమని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ఇప్పటికీ అనడం తీవ్ర హాస్యాస్పదమన్నారు. ‘‘అధికారం చేపట్టిన ఏడాదిన్నరలోనే సర్దుబాటు పేరుతో జనాలకు గుండెపోటు తెప్పించారు. రూ.15 వేల కోట్ల మేర ట్రూ అప్ బిల్లులతో జనాల జేబులకు చిల్లులు పెట్టారు. ఇప్పుడు మరో రూ.15 వేల కోట్లకు టైం ఆఫ్ ది డే పేరుతో దోచేందుకు కసరత్తు చేస్తున్నారు. నమ్మి ఓటేసిన పాపానికి రాష్ట్ర ప్రజలకు ఏడాదికో హైటెన్షన్ షాక్ పెడుతున్నారు. లోటు పేరుతో జనాలను బాదడం అత్యంత దారుణం. నిజంగా కరెంట్ ఛార్జీలు పెంచొద్దని చిత్తశుద్ధి తమకుంటే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై నిలబడే తత్వమే తమదైతే, APERC రూపొందించిన ప్రతిపాదనలపై తక్షణం స్పందించండి. రూ. 15 వేల కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయండి. ఇప్పటి వరకు ప్రజలపై మోపిన మరో రూ.15 వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలను సైతం రద్దు చేయండి.’’ అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.






