- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా వైఎస్ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన షర్మిల
కర్నూల్ ఉల్లి మార్కెట్లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. కొడుకు రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్ రాజారెడ్డి మునిమనుమడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనుమడు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తనయుడు అయిన వైఎస్ రాజారెడ్డి (YS Rajareddy) రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ సోమవారం ఉదయం నుంచీ వార్తలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ లోని తమ నివాసం నుంచి బయల్దేరేముందు అమ్మమ్మ విజయమ్మ ఆశీస్సులు తీసుకుని, తల్లి షర్మిల వెంట కర్నూల్ ఉల్లి మార్కెట్ కు చేరుకున్న రాజారెడ్డి వీడియోలు వైరల్ కావడమే ఇందుకు ప్రధాన కారణం.
కర్నూల్ ఉల్లి మార్కెట్లో మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. కొడుకు రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చారు. సమయం ఆసన్నమైనపుడు ఆంధ్ర రాజకీయాల్లోకి తన కొడుకు రాజారెడ్డి తప్పకుండా వస్తాడని స్పష్టం చేశారు. రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అని షర్మిల చెప్పడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మళ్లీ వైఎస్సార్ నాటి రోజులు రావాలని ఆకాంక్షించారు.
Read More..






