మోడీది ఏపీపై స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌.. వైఎస్ ష‌ర్మిల ఫైర్

by Ajay Maddhiboyina |

మోడీది ఏపీపై స‌వ‌తి త‌ల్లి ప్రేమ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌కృతి విల‌యాల‌కు వెంట‌నే జాతీయ విప‌త్తులుగా ప్ర‌క‌టించుకునే ప్ర‌ధాని రాష్ట్రంపై మాత్రం మ‌ళ్లీ స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపిస్తున్నార‌ని ఆరోపించారు. మెంథా తుఫాన్ దాటికి జ‌న‌జీవ‌నం అల్ల‌క‌ల్లోలం అయితే త‌మ‌కే ప‌ట్ట‌న‌ట్టు చోద్యం చూస్తున్నార‌ని అన్నారు.

మోడీది ఏపీపై స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌.. వైఎస్ ష‌ర్మిల ఫైర్
X

దిశ,వెబ్ డెస్క్: మోడీది ఏపీపై స‌వ‌తి త‌ల్లి ప్రేమ అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మండిప‌డ్డారు. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌కృతి విల‌యాల‌కు వెంట‌నే జాతీయ విప‌త్తులుగా ప్ర‌క‌టించుకునే ప్ర‌ధాని రాష్ట్రంపై మాత్రం మ‌ళ్లీ స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌ను చూపిస్తున్నార‌ని ఆరోపించారు. మెంథా తుఫాన్ దాటికి జ‌న‌జీవ‌నం అల్ల‌క‌ల్లోలం అయితే త‌మ‌కే ప‌ట్ట‌న‌ట్టు చోద్యం చూస్తున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్రజల మద్దతుతో మూడో సారి గద్దెనెక్కిన మోడీ గారు ఆపద సమయంలో మొహం చాటేసి మరోసారి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమ‌ర్శించారు. మెంథా తుఫాన్ కార‌ణంగా రాష్ట్రంలో 20ల‌క్ష‌ల ఎక‌రాల‌కు పైగా నీట మునిగాయ‌ని చెప్పారు. ఖ‌రీఫ్ సీజ‌న్ లో సాగైన పంట‌ల్లో 30 శాతానికి పైగా ప‌నికి రాకుండా పోయాయ‌ని వ్యాఖ్యానించారు.

10 ల‌క్ష‌ల మంది రైతు కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయ‌ని తెలిపారు. రైతాంగానికి సంబంధించి భారీ న‌ష్టం జ‌రిగింద‌ని చెప్పారు. మొంథా తుఫాన్ ను వెంట‌నే జాతీయ విప‌త్తుగా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. పంట న‌ష్టం అంచ‌నా వేయ‌డానికి వెంట‌నే జాతీయ బృందాల‌ను పంపాల‌న్నారు. అంచనా నివేదికలొచ్చే లోపు రాష్ట్రానికి తక్షణ సహాయం కింద రూ.10 వేల కోట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. NDA ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు.. రాష్ట్రానికిది ఆపద కాలం, రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కేవలం 2.88 లక్షల ఎకరాల్లోనే నష్టం జరిగినట్లు తక్కువ చేయడం భావ్యం కాదని చెప్పారు.

ఇది రైతులను కూటమి ప్రభుత్వం చేస్తున్న మోస‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఇది వెన్నుముక లాంటి రైతన్నకు అండగా నిలబడే సమయమ‌ని, పంటలతో పాటు ఆస్తి నష్టం అధికమేన‌ని అన్నారు. సర్వం కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లోనే ఉంద‌ని, మోడీ మోసాలు చూస్తూ ఇన్నాళ్లు మోకరిల్లిన సీఎం చంద్రబాబు ఇప్పుడైనా నోరు విప్పాల‌న్నారు. జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేయాల‌ని చెప్పారు. జరిగిన నష్టానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం తీసుకురావాల‌ని, తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల‌ని చెప్పారు.

Next Story