- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లు అయినా మహాశక్తి పథకానికి అతి గతి లేదు: వైఎస్ షర్మిల
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్ప మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా మహాశక్తి పథకానికి అతి గతి లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు. పండుగల పేరు చెప్పి కాలయాపన తప్ప మహిళా సాధికారితపై కమిట్మెంట్ లేదని అన్నారు. పథకం కావాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని ఒకరు, మహిళలు రెడీగా ఉండమని మరొకరు.. దీపావళి, సంక్రాంతికి ఇస్తామని ఇంకొకరు ఆడబిడ్డల మనోభావాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పేరుతో కోటిన్నర మంది రాష్ట్ర మహిళలకు సీఎం చంద్రబాబు చేసింది ఘరానా మోసమేనని పేర్కొన్నారు. నెలకిచ్చే 15 వందలతో 15 వేలు చేస్తామని అన్నారు.
15వేలను లక్షా 50 వేలకు ఆదాయం పెంచే మార్గం చూపుతామన్నారు. మహిళల అభివృద్ధికి పెద్దపీట అంటూ చెప్పినవన్నీ పచ్చి బూటకపు మాటలని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఆడబిడ్డ నిధి ప్రధాన హామీ అని తెలిపారు. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు ఆర్థికంగా బరోసా నిచ్చే హామీ అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది 18 వేలు లబ్ధి చేకూరే పథకానికి రెండేళ్లుగా పంగనామాలు పెడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకోడానికి కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి సిగ్గుండాలని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల హామీలు నచ్చినప్పుడు, ఇష్టం ఉన్నప్పుడు అమలు చేసేవి కావన్నారు. మహాశక్తి పథకాన్ని తక్షణం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని, రాష్ట్ర మహిళల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.






