జగన్ భార్య భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల సంచలన డిమాండ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-09 13:29:44  IST  )

సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటున్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు....

జగన్ భార్య భారతీరెడ్డి క్షమాపణ చెప్పాలి: వైఎస్ షర్మిల సంచలన డిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: సాక్షిలో చర్చలు దారుణంగా ఉంటున్నాయని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మహిళలను కించపరుస్తూ సాక్షి ఛానల్ డిబేట్ నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. చిత్తూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్షి టీవీ ఛైర్‌పర్సన్, జగన్ సతీమణి భారతీరెడ్డి(Jagan wife Bharathi Reddy) వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి(Amaravati)కి వ్యతిరేకంగా సాక్షి(Sakhi)లో మాట్లాడటం అవమానకరమన్నారు. అమరావతి మహిళలను కించపర్చడంపై మాజీ సీఎం జగన్(Former CM Jagan) క్షమాపణ చెబితే సంతోషిస్తామని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై సాక్షి దృష్టి పెడితే బాగుంటుందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని మీడియా సంస్థగా సాక్షి చరిత్రకెక్కిందని షర్మిల విమర్శించారు.

Next Story