- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుల ఆందోళన.. వైఎస్ షర్మిల సంచలన డిమాండ్
కూటమి ప్రభుత్వానికి దివ్యాంగులపై మానవత్వం లేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల(Disabled)పై మానవత్వం లేదని వైఎస్ షర్మిల(Ys Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కనికరం లేకుండా వారి పొట్ట కొట్టాలని చూడటం దారుణమని ఆమె మండిపడ్డారు. వికలాంగుల జీవితాల్లో వెలుగులు పోయి చీకటి నింపడం దుర్మార్గమన్నారు. అనర్హుల కింద అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించాలని చూడటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అనర్హత పేరుతో 20 ఏళ్ల నుంచి పెన్షన్‌పై బ్రతుకుతున్న వారికి సైతం రద్దు చేయాలని చూడటం సిగ్గుచేటని చెప్పారు. వికలాంగుల జీవితాలతో రాజకీయం తగదని షర్మిల సూచించారు.
‘‘బోగస్ పెన్షన్లు గుర్తించడం మంచిదే. వికలాంగుల ముసుగులో అక్రమంగా పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులను ఏరివేత హర్షించ దగ్గదే. దొంగ సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళపై, ఇచ్చిన వైద్యులపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కానీ రీ వెరిఫికేషన్ పేరిట అర్హులను సైతం అనర్హులుగా పరిగణించడం పద్దతి కాదు. అర్హుల పేర్లు తొలగించి వారిని వేధించడం సరికాదు. నోటీసులు ఇచ్చిన 1.20 లక్షల మందిలో అర్హులే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. అనర్హులుగా గుర్తించిన జాబితాపై మళ్ళీ వెరిఫికేషన్ చేయండి. అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని, వెంటనే వారి పెన్షన్లు పునరుద్ధరించాలి.’’ అని షర్మిల డిమాండ్ చేశారు.






