YS SHARMILA: బాబు ఏడాది పాలన అంతా 3D గ్రాఫిక్స్: వైఎస్ షర్మిల

by Ajay Maddhiboyina |

సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా.. చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని ఇచ్చిన వాగ్దాలను

YS SHARMILA: బాబు ఏడాది పాలన అంతా 3D గ్రాఫిక్స్: వైఎస్ షర్మిల
X

దిశ‌, వెబ్ డెస్క్: సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా.. చంద్రబాబు సమాధానం చెప్పాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైందని ఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవడం ఉందా లేదా అని ప్రశ్నించారు. వాగ్దానాలను నిలబెట్టుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నిలదీశారు. కాలయాపన చేస్తూ మళ్లీ ఎన్నికల ముందు, చివరి ఏడాది వాగ్దానాలను అమలు చేసే ఆలోచన ఉందా చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. ఏడాది పాటూ చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.

సూప‌ర్ సిక్స్‌లో భాగంగా చంద్రబాబు ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేల రూపాయలు ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఇంత వరకు ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. నలుగురు బిడ్డలు ఉంటే రూ.60 వేలు ఇస్తామన్న చంద్రబాబు ఇంట్లో ఒక్కబిడ్డకు రూ.15వేలు కూడా ఇవ్వలేదని అన్నారు. నిరుద్యోగభృతి ఇస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేశార‌న్నారు. ఉద్యోగాలు ఇవ్వ‌కుండా నిరుద్యోగభృతి కూడా ఎగ్గొట్టార‌ని విమ‌ర్శించారు. ఉచిత బ‌స్ ఇస్తామ‌ని చెప్పార‌ని, ఈ చిన్న ప‌థ‌కాన్ని కూడా అమ‌లు చేయ‌లేద‌ని అన్నారు. బాబు ఏడాది పాలన అంతా మళ్లీ త్రీడీ గ్రాఫిక్స్ లా ఉందని విమర్శించారు.

Next Story