- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగన్‌కు ఇదెక్కడి పద్ధతి: వైఎస్ షర్మిల ఆగ్రహం
రాష్ట్రంలో పథకాలన్నీ కూటమి వారికే ఇస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అటు వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనను ఆమె తప్పుబట్టారు

దిశ, వెబ్ డెస్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(Kutami Government) ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిపిందే. అయితే ఆ పథకాలన్నీ పార్టీ వాళ్లకే ఇస్తున్నారని వైఎస్ షర్మిల(Ys Sharmila) ఆరోపించారు. ఈ మేరకు విమర్శలు కురిపిస్తున్నారు. అటు వైఎస్ జగన్(Ys Jagan) ప్రభుత్వ పాలనను ఆమె తప్పుబట్టారు. అప్పుడు కూడా ఇంతే జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. మహానేత YS రాజశేఖర్ రెడ్డి(Ys Rajasekhar Reddy) సీఎంగా ఉండగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పథకాలు ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు.
నేటి రాజకీయాలు అలా లేవు..
అయితే నేటి రాజకీయాలు అలా లేవని, అధికార పక్షంతో ఉంటే తప్పా పథకాలు రావని వైఎస్ షర్మిల మండిపడ్డారు. YCP 5 ఏళ్ల పాలనలో పథకాలు ఆ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు సైతం తమ కూటమి కార్యకర్తలకే పథకాలు వర్తింప జేస్తున్నారని, ఇదెక్కడి పద్ధతి అని షర్మిల ప్రశ్నించారు. ప్రజలను ప్రజలుగా చూడాలని, పార్టీలకు అంటగట్టడం తగదని సూచించారు. అటు ప్రజలు సైతం పార్టీలకు అతీతంగా ఉండాలని, మార్పు, చైతన్యం రెండూ రావాలని ఆకాంక్షించారు. నేతలు బాగుంటేనే ప్రజలు బాగుంటారని, సిద్ధాంతాలు ప్రజల కోసం రూపొందించాలని, YSR నిజమైన ప్రజా నాయకుడు అని వైఎస్ షర్మిల కొనియాడారు.






