బస్సు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి: వైఎస్ షర్మిల

by Ajay Maddhiboyina |

కర్నూల్ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ లో స్పందించారు. కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలా మంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలి: వైఎస్ షర్మిల
X

దిశ‌, వెబ్ డెస్క్: కర్నూల్ బస్సు ప్రమాద ఘటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ లో స్పందించారు. కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులోనే చాలా మంది ప్రయాణికులు సజీవదహనం అవ్వడం అత్యంత విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని, మృతుల సంఖ్య పెరగకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి సూచించారు. మరణించిన వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటన పై ఉన్నతస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక ప్రస్తుతం కర్నూల్ బస్ ప్రమాదంలో మృత దేహాల‌ను ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించే ప‌నిలో ఉన్నారు. బ‌స్సులో మొత్తం 42 మంది ప్ర‌యాణించ‌గా 19మంది ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది.

Next Story