- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమాల గురించి వైఎస్ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం:మంత్రి ఆనం
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత నిన్న(గురువారం) మీడియా ముందు చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత నిన్న(గురువారం) మీడియా ముందు చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ తరుణంలో తాజాగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలు అని తెలిపారు. జగన్ వ్యాఖ్యలకు మంత్రి ఆనం కౌంటర్ వేశారు. ఈ రోజు(శుక్రవారం) నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్‌లో మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారయణ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ విషప్రచారాన్ని మనమంతా తిప్పికొట్టాలని మంత్రి ఆనం సూచించారు. వైసీపీ హయాంలో జరగనీ స్కామ్ లేదని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో స్కామ్ వీరులు జగన్ పక్కనే ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో అక్రమాల గురించి వైఎస్ జగన్ మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.
వెన్నుపోటు దినం అనడం ప్రజాతీర్పును అవమానించడమే అని మంత్రి ఆనం పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది అని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతితో రాష్ట్రం వెనకబడిపోయింది అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రావడంతో ప్రాజెక్టులు, పరిశ్రమలతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం తెలిపారు.






