కోర్టు బిగ్ షాక్.. పులివెందుల, ఒంటిమిట్టలో జగన్‌ ఆశలు గల్లంతు

by Vemula.Srinu Prasad |

కోర్టు తీర్పుతో పులివెందుల, ఒంటిమిట్టలో జగన్‌ ఆశలు గల్లంతయ్యాయి...

కోర్టు బిగ్ షాక్.. పులివెందుల, ఒంటిమిట్టలో జగన్‌ ఆశలు గల్లంతు
X

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల(Pulivendula), ఒంటిమిట్ట(Ontimitta)లో తెలుగుదేశం పార్టీ(Telugudesam Party)ని ఓడించేందుకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ రెండు ప్రాంతాల ప్రజలు సైకిల్ వైపు నిలిచారు. దీంతో ఫ్యాన్ కొట్టుకుపోయింది. టీడీపీ విజయకేతనం ఎగురవేయగా వైసీపీ ఎదురుదెబ్బను టెస్ట్ చేసింది. అయినా ఆ పార్టీ నాయకులు వెనక్కి తగ్గేదిలేదని పోరాటం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ పోరాటం నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కోర్టు తీర్పు పెట్టుకున్న ఆశలు సైతం గల్లంతయ్యాయి. దీంతో రెండు చోట్ల ఓటమిని ఒప్పుకోక తప్పసరి పరిస్థితి ఆ పార్టీది అయింది.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ఈ నెల 12న జరిగాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేశారు. పులివెందులలో అయితే 30 ఏళ్ల తర్వాత పోలింగ్ జరగడంతో ప్రజలు ఓటింగ్‌కు పోటెత్తారు. చెదరుమదురు ఘటన మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఈ రోజు అనగా గురువారం రిజర్ట్స్ వచ్చాయి. పులివెందుల, ఒంటిమిట్టలో తెలుగుదేశ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల పోలింగ్ లో అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్‌‌ను ధర్మాసనం కొట్టివేసింది. రీపోలింగ్ విషయం ఎన్నికల కమిషన్ చూసుకుంటుందని, తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఆ పార్టీ అధినేత జగన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్టైంది. సొంత ఇలాక అయిన పులివెందులను పోగొట్టుకోవడంతో జగన్‌కు ఘోర పరాభవం జరిగినట్లు వైసీపీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఈ సమయంలో కోర్టుపై పెట్టుకున్న ఆశలు సైతం గల్లంతకావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చూడాలి మరి అసెంబ్లీ నాటికి వైసీపీ మళ్లీ పుంజుకుంటుందేమో.

Next Story