BREAKING: జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-04 08:17:47  IST  )

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు విచ్చేశారు.

BREAKING: జగన్ కాన్వాయ్‌కు ప్రమాదం.. బందర్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంగళవారం కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు విచ్చేశారు. పర్యటనకు ముందే పోలీసులు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కానీ.. వైసీపీ శ్రేణులు వాటిని ఉల్లంఘించడమే కాక .. అత్యుత్సాహం ప్రదర్శించారు. డీజే ఏర్పాటు చేయడంతో పోలీసులు దానిని అడ్డుకున్నారు. నిబంధనలను పాటించాలని పోలీసులు చెప్పగా.. మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వారితో వాగ్వాదానికి దిగారు.

కాసేపటికే జగన్ కాన్వాయ్ (Jagan Convoy) నియోజకవర్గంలోకి రాగా.. బందరు రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Next Story