- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS జగన్ అడ్డాలో సైకిల్ సవారీ.. పులివెందుల పాలిటిక్స్‌కు బ్రేక్‌లు
పులివెందుల రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.

దిశ,వెబ్‌డెస్క్: పులివెందుల రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. రాష్ట్ర రాజకీయాల్లో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకర్గంలో తొలిసారి టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 5వేల మెజార్టీతో గెలిచారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వలె హోరాహోరీగా పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో.. ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠ తెరపడింది. అధికార పార్టీకి గెలుపు దక్కింది.
దీంతో పులివెందులలో జరిగిన జడ్పీటీసీ బైపోల్ పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా వైఎస్ఆర్ కుటుంబం ఆధిపత్యంలో ఉన్న పులివెందుల నియోజవర్గంలో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోవడం గమనార్హం. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయడం రాజకీయంగా ఒక సంచలన మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫలితం భవిష్యత్తు రాజకీయాల పై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు.
పులివెందులలో టీడీపీ గెలుపు.. వైఎస్ అవినాశ్ రెడ్డి రియాక్షన్ ఇదే






