నేడు పులివెందులకు వైఎస్ జగన్...3 రోజుల పాటు టూర్

by velandi.Saikiran |

నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక

నేడు పులివెందులకు వైఎస్ జగన్...3 రోజుల పాటు టూర్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరార్ అయింది. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ 3 రోజుల పర్యటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే, ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో పులివెందుల చేరుకుంటారు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు.

రాత్రికి అక్కడే నివాసంలోనే బస చేస్తారు జగన్. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్ లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి కూడా జగన్ హాజరు కానున్నారు. అనంతరం బ్రాహ్మణపల్లి చేరుకుంటారు. అక్కడ అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. ఆ త‌ర్వాత‌ లింగాల మాజీ సర్పంచ్‌ మహేష్‌ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం పులివెందుల చేరుకొని, క్యాంప్ ఆఫీసులో రాత్రి 7 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఆ రోజున రాత్రి అక్కడే నివాసంలోనే బస చేసి, గురువారం ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి జగన్ తిరుగు ప్రయాణం అవుతారు.

Next Story