మాజీ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్..?

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-20 08:56:24  IST  )

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవాళ(గురువారం) శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు.

మాజీ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్..?
X

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవాళ(గురువారం) శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. జిల్లాలోని పాలకొండలో ఇటీవల వైసీపీ నేత పాలవలస రాజశేఖరం మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్(Former CM Jagan) పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ తాడేపల్లి లోని తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పాలకొండ చేరుకున్నారు.

అయితే.. వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (81) ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. రాజశేఖరం మృతి విషయాన్ని విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్(YS Jagan) దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో నేడు రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం పాలకొండ నుంచి నేరుగా బెంగళూరుకు పయనమవుతారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకున్న వైఎస్ జగన్ మంగళవారం విజయవాడ జిల్లా జైలులో మాజీ ఎమ్మెల్యే(Former MLA) వల్లభనేని వంశీని(Vallabhaneni Vamshi) ములాఖత్‌లో కలిసి పరామర్శించారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డ్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.

Next Story