video viral: ఒక ముద్దు.. ఏడు జన్మల ఆప్యాయత.. చిన్నారి కలను జగన్ నిజం చేసిన ఆ క్షణం..ఈ వీడియో చూస్తే ఏదో తెలియని ఫీలింగ్

by Vennela |

video viral: జగన్ విజయవాడ పర్యటనలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

video viral: ఒక ముద్దు.. ఏడు జన్మల ఆప్యాయత.. చిన్నారి కలను జగన్ నిజం చేసిన ఆ క్షణం..ఈ వీడియో చూస్తే ఏదో తెలియని ఫీలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: video viral: జగన్ విజయవాడ పర్యటనలో ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. జగన్‌ను కలవడం కోసం వచ్చిన ఓ చిన్నారి అందరి మనసులను దోచుకుంది. ఆమె చిన్న చేతులతో జగనన్న ముఖాన్ని పట్టుకుంది.. ఆమె చిన్న నోటితో జగనన్నను ముద్దాడింది!

విజయవాడలో సమయం మధ్యాహ్నం దాటింది. గాలిలో ఓ అణువు మారినట్టుగా, జనాల్లో ఒక్కసారి ఓ వణుకు పుట్టినట్టుగా జగన్‌ వచ్చారనే అన్న వార్త దవణంలా వ్యాపించింది. ప్రేమిస్తే ప్రాణం పెట్టే జనాలు, చూసిన ఒక్కసారి జీవితాంతం గుండెల్లో నిలిపే అభిమానులు, సంద్రంలా ఎగసిపడ్డారు. మాజీ సీఎం కోసం పరుగులు తీశారు.

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత ఆయనతో ములాఖత్‌కు జగన్‌ విజయవాడలో అడుగుపెట్టగానే రహదారులన్నీ వైసీపీ నినదించే గొంతుకలతో నిండిపోయాయి. అలా సాగుతున్న ర్యాలీలో ఒక్కచిన్నారి గళం గాలిలో మారుమోగింది. "జగనన్నా… జగనన్నా…" అని కన్నీటితో పిలుస్తూ, తన చిన్న చేతుల్ని ఆకాశం వైపు చాచింది. తండ్రి భుజాలపై నిలబడి ఉన్న ఆ చిన్నారి కళ్లలో ఒక గాఢమైన ఆశ.. ఒక అమాయకమైన ప్రేమ. ఇది ఒక్కరికే కనిపించిన స్పందన కాదు.

ఆమె ఆర్తి, ఆమె పిలుపు జనసంద్రాన్ని కదిలించింది. ఆ కన్నీటి లోటులో అర్థం లేనిదేదీ లేదు. అది ఒక చిన్న హృదయం తన సంతోషాన్ని, తన ప్రేమను వ్యక్తపరచడానికి చేసిన ప్రయత్నం. జగన్‌ను చూడాలని, కలవాలనే ఆమె ప్రయత్నం ఫలించింది.

ఒక నిమిషం.. జగన్‌ కారును ఆపేశారు. ఆ కన్నీటి లోతుని తట్టుకోలేక, ఆమె తడి కళ్లకు సమీపం చేరింది. చిన్న చేతులతో పట్టుకుని ఎదురుగా నిలిచిన జగన్ దగ్గరికి చేరింది. ఆ చిన్నారి కన్నీళ్లు ఆగలేదు… కానీ మారిపోయాయి. కన్నీటి బాధ ఆనంద బిందువుగా మారింది! నివ్వెరపోయిన ఆ క్షణంలో ఆమె చిన్న హృదయం గట్టిగా దడదడలాడింది. ఆ సమయంలో జగన్‌ ఆ చిన్నారి నుదిటిపై పెట్టిన ఒక ముద్దు.. ఒక తీయని హృదయ స్పందనగా మారింది. అంతా ఆమెకు ఇది కలలా అనిపించింది. ఒక తడిమి చూసిన కల.. తన చిన్న చేతులను చాచి మళ్లీ దగ్గరికి లాగింది. ఆ చిన్న నోటితో జగన్‌ నుదిటిపై తిరిగి ఒక ముద్దు పెట్టింది.


అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ క్షణానికి సాక్ష్యంగా నిలిచారు. మాటలు లేకుండానే జరిగిన అనుభూతిని తన మొబైల్‌లో బంధించింది ఆ చిన్నారి. తన చేతుల్లోని సెల్‌ఫోన్‌ను బయటకు తీసుకుని, జీవితాంతం మిగిలే జ్ఞాపకాన్ని ఆపాదించుకుంది. జగన్‌తో సెల్ఫీని దిగింది. ఆమెకు ఇది ఒక్క రోజు ఘటన కాదు, జీవితాంతం తడిపి మరచిపోలేని ఓ అనుభూతి. తండ్రి తనను తీసుకెళ్తున్నా.. ఆమె వెనుకకు చూస్తూనే ఉంది. జగన్‌పై ఇష్టంతో.. ఏదో తెలియని మమతగా… ఆమె చిరునవ్వు ఆకాశం చీల్చేలా మెరిసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో పార్టీలకతీతంగా విపరీతంగా షేర్ అవుతోంది.



Next Story