AP NEWS: 'నంద్యాల'కు.. వైఎస్ జగన్.!

by Geesa Chandu |

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాలలో హత్యకి గురైన వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన జగన్, వారి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

AP NEWS: నంద్యాలకు.. వైఎస్ జగన్.!
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాలలో హత్యకి గురైన వైసీపీ కార్యకర్త సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించటానికి వెళ్లిన జగన్, వారి కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే జగన్ కు మద్దతు తెలపటానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తర్వాత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. నంద్యాల తో పాటుగా రాష్ట్రమంతా కూటమి నేతలు.. వారి ఆధిపత్యాన్ని చూపించటానికే తమ పార్టీ కార్యకర్తలపై ఈ విధంగా కత్తులతో, కర్రలతో, రాళ్లతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు.

నంద్యాలలోని సీతారామపురం గ్రామంలో సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతని ఇంటిలోకి చొరబడి అర్ధరాత్రి ప్రత్యర్ధులు కత్తులతో, కర్రలతో విరుచుకు పడ్డారు. ఈ ఘటనలో పెద్ద సుబ్బారాయుడు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారాయుడు భార్య బాలసుబ్బమ్మ పై కూడా కత్తులతో దాడి చేయగా.. ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రి లో చేరింది. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి పనిచేశాడనే అక్కసుతోనే.. స్థానికంగా ఉన్న తెలుగు దేశం నాయకులు ఈ దారుణానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది. ఈ హత్య ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తులు కర్రలు సెల్ఫోన్లు, ఒక ఫార్ట్యూనర్ కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన యాభై రోజుల్లోనే ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఇదివరకే ఆరోపించారు.

Next Story