రేపు సీబీఐ కోర్టులో హాజరు కానున్న వైయస్ జగన్

by Thanuru Gopichand |

మాజీ సీఎం వైయస్ జగన్ రేపు (గురువారం) సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court) ముందు హాజరుకానున్నారు.

రేపు సీబీఐ కోర్టులో హాజరు కానున్న వైయస్ జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం వైయస్ జగన్ రేపు (గురువారం) సీబీఐ ప్రత్యేక కోర్టు (CBI Special Court) ముందు హాజరుకానున్నారు. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. దీనిపై సీబీఐ (CBI) స్పందిస్తూ జగన్ గత ఆరేళ్లుగా కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కావడం లేదని పేర్కొంది. కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై ప్రతిరోజూ విచారణ జరుగుతున్నట్లు సీబీఐ తెలిపింది. కాబట్టి వైయస్ జగన్ (YS Jagan) వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు నవంబరు 21లోగా జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశానికి అనుగుణంగా ఒకరోజు ముందే వైయస్ జగన్ కోర్టుకు హాజరు కానున్నారు.

Next Story