- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్షమాపణలు చెప్పిన తర్వాతే జగన్ బెంగళూరు వెళ్లాలి: మంత్రి నారా లోకేశ్ డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 9 మంది మృతి చెందారు. మరో ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది...

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant)లో జరిగిన అగ్నిప్రమాదం(Fire Accident)లో మొత్తం 9 మంది మృతి చెందారు. మరో ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. బాధితులను పరామర్శించి ఈ ఘటనకు కారణం తమరంటే తమరని వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విశాఖ ఉక్కును తాము రెండుసార్లు కాపాడామని, అది తమ చరిత్ర అని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును గత ప్రభుత్వంలో జగన్ విధ్వంసం సృష్టించిందని, మూడో రాజధాని అంటూ భూములు కొట్టేయాలని యత్నించారని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్ వల్ల కాలుష్యం అంటూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడారని మండిపడ్డారు., స్టీల్ ప్లాంట్ కార్మికులకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత జగన్ బెంగళూరు వెళ్లాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.






