కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ సంచలన ట్వీట్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-23 11:57:54  IST  )

సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు జగన్ 13 ప్రశ్నలు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చామని, తాను వెళ్లిన ప్రతిచోట ఆంక్షలు పెడుతున్నారని అన్నారు.

కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ సంచలన ట్వీట్
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. చంద్రబాబుకు జగన్ 13 ప్రశ్నలు వేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛనిచ్చామని, తాను వెళ్లిన ప్రతిచోట ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. రాజ‌కీయాల‌ను మ‌రింత దిగ‌జార్చార‌ని విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా తాను కార్య‌క‌ర్త‌ల ఇంటికి వెళ్ల‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. రైతుల త‌ర‌ఫున‌, ప్ర‌జ‌ల త‌ర‌ఫున వారికి సంఘీభావం తెలియ‌జేయ‌డానికి వెళ్ల‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించారు. మాజీ సీఎంగా జ‌డ్ ప్ల‌స్ సెక్యురిటీ భద్ర‌త అన్న‌ది త‌న హ‌క్కు కాదా అని అడిగారు. బుద్ధిపుట్టిన‌ప్పుడు జడ్ ప్ల‌స్ కేట‌గిరీ సెక్యూరిటీ విత్ డ్రా చేసుకుంటామ‌నే అధికారం ఏ ప్ర‌భుత్వానికైనా ఉంటుందా అని నిల‌దీశారు. జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారన్నారు.

అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలన్నారు. ఇది నాకైనా మీకైనా ఒక‌టేన‌ని పేర్కొన్నారు. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ప్రోటోకాల్ పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. జడ్‌ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? అని అడిగారు.

మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితులు ఉంటాయ‌నే కదా జడ్‌ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీ కోరేద‌ని అన్నారు. మాజీ సీఎంకు బుల్లెట్ ప్రూఫ్ వ‌హ‌నం ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని మీరు ఇవ్వ‌లేద‌ని నేనే కొనుకున్నాన‌ని చెప్పారు. వాహ‌నానికి ప్ర‌భుత్వ‌మే గ‌వ‌ర్న‌మెంట్ డ్రైవ‌ర్ ను ఇచ్చింద‌ని, మ‌రి ఆ డ్రైవ‌ర్ న‌డుపుతున్న వాహ‌నానికి సెక్యురిటీ ఇవ్వాల్సిన బాధ్య‌త మీది కాదా అని అడిగారు. ఎస్పీ ఈ ఘ‌ట‌న మీద ఇచ్చిన స్టేట్ మెంట్ ఏంట‌ని? మ‌రి ఎందుకు టాపిక్ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. త‌న‌పై ప్ర‌జ‌లు చూపుతున్న ప్రేమ‌ను ఓర్వ‌లేక‌నే డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని పార్టీ నాయకులు చెప్పిన వెంట‌నే స్పందించి ఆ కుటుంబానికి రూ.10 ల‌క్ష‌లు ఇచ్చి ఆదుకున్నామ‌న్నారు. మీ ప‌ర్య‌ట‌న‌ల స‌మ‌యంలో చ‌నిపోయిన వారి విష‌యంలో ఏం చేశార‌ని నిల‌దీశారు. ఎంత‌మేర చేశార‌ని అన్నారు. మాన‌వ‌త్వం గురించి మీరు మాట్లాడుతున్నారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Next Story