ఇందాపూర్‌ డెయిరీ చంద్రబాబుదే.. ఇదిగో ప్రూఫ్: మాజీ సీఎం జగన్

by Vemula.Srinu Prasad |

తిరుపతి లడ్డూ తయారీలో వినియోగించేందుకు ఇందాపూర్‌ డెయిరీ నెయ్యిని సరఫరా చేసిందని వైఎస్ జగన్ తెలిపారు.....

ఇందాపూర్‌ డెయిరీ చంద్రబాబుదే.. ఇదిగో ప్రూఫ్:  మాజీ సీఎం జగన్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి లడ్డూ తయారీ(Tirupati Laddu Preparation)లో వినియోగించేందుకు ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి(Indapur Dairy Ghee)ని సరఫరా చేసిందని వైఎస్ జగన్ తెలిపారు. ఆ డెయిరీ సీఎం చంద్రబాబుదే(Cm Chandrababu)నని ఆయన చెప్పారు. హెరిటేట్‌ అఫిషయల్‌ వెబ్‌సైట్‌(Heritage official website)లో ఫిబ్రవరి 16, 2026లో మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా ఇందాపూర్‌ డెయిరీ ఉందని జగన్ తెలిపారు. గుట్టు బయటకు రాగానే అదే అఫిషియల్‌ వెబ్‌సైట్‌లో కోమ్యానిప్యాక్చరింగ్‌ లొకేషన్‌గా ఫిబ్రవరి 15,2026లోనే ఉందని మార్చారని తెలిపారు. ఇందాపూర్‌ డైరీ వ్యవహారం వెలుగులోకి రావడంతో హెరిటేజ్‌ వీపీ,సేల్స్‌ హెడ్‌ను తొలగించిందన్నారు. 2015లో చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి ఇందాపూర్‌ డెయిరీని ప్రమేయం చేశారని చెప్పారు. 2016 మార్చి 18 ఇందాపూర్‌ డెయిరీ నెయ్యి నాణ్యత లోపించిందని, డిస్‌క్వాలిఫై అయిన మూడు నెలల్లో ఇందాపూర్‌ డెయిరీకి చంద్రబాబు అర్హత కల్పించారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. నవంబర్‌ 27, 2026న హేరిటేజ్‌ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌ దక్కిందని జగన్ వ్యాఖ్యానించారు.

కేజీ నెయ్యి రూ.321కు ఆర్డర్‌

అంతేకాదు కేజీ నెయ్యి రూ.321 ఆర్డర్‌ ఇచ్చినట్లు జగన్ పేర్కొన్నారు. 2024లో చంద్రబాబు అధికారంలోకి రాగానే మళ్లీ ఇదే ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌ ఖరారు చేశారని జగన్ చెప్పారు. కేజీ నెయ్యి రూ.658కే టీటీడీకి అమ్ముతున్నారని పేర్కొన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలకు కేంద్ర ల్యాబ్‌ రిపోర్టులు టెస్టులు చేసి సర్టిఫికెట్‌ ఇస్తారన్నారు. బోలే బాబా ఆర్గానిక్‌ డైయిరీ అని హర్ష్‌ డైయిరీదేనని ఆధారం ఉందన్నారు. బోలేబాబాకు ఆర్డర్లు ఇచ్చిందని తద్వారా తెరిచింది చంద్రబాబేనని పేర్కొన్నారు. 2018 జూన్‌ 26న బోలే బాబాకు టెక్నికల్‌ క్వాలిఫికేషన్‌ ఇస్తూ నాడు చందరబాబు హయాంలో అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. బోలేబాబాకు 6-3-2019న 82వేల కేజీల నెయ్యి సరఫరా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. ఇదే బోలేబాబా తాము హెరిటేజ్‌తో కలిసి పని చేస్తున్నట్లు ఈకామర్స్‌ వెబ్‌సైట్‌లో ఇండియా మార్ట్‌లో తెలిపిందని, అలా తెలిపిందే బోలేబాబా అని జగన్ వ్యాఖ్యానించారు. బోలేబాబా రాజస్థాన్‌ది కాదని, ఉత్తరాఖండ్‌ది కాదని చెబుతున్నారని, మరి హెరిటేజ్‌ విజయవాడ.. హెరిటేజ్‌ హైదరాబాద్‌ ఒకటి కావా ప్రశ్నించారు. హెరటేజ్‌ రాజస్థాన్‌.. హెరిటేజ్‌ ఉత్తరాఖండ్‌ ఒకటి కాదా అని జగన్ నిలదీశారు.

Next Story