నెల్లూరు జైలుకు చేరుకున్న వైఎస్ జగన్.. మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-31 05:16:53  IST  )

మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పర్యటన నేపథ్యంలో నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.

నెల్లూరు జైలుకు చేరుకున్న వైఎస్ జగన్.. మాజీ మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) పర్యటన నేపథ్యంలో నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే పోలీసు శాఖ అప్రమత్తమైంది. వివిధ జిల్లాల నుంచి జనం భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా నెల్లూరు అంతటా భారీగా పోలీసులను మోహరించారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ కాసేపటి క్రితం నెల్లూరు జిల్లా జైలుకు చేరుకున్నారు. అనంతరం హెలీప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు అయనకు ఘన స్వాగతం పలికాయి. అక్కడ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Goverdhan Reddy)తో ములాఖత్ కానున్నారు. ఆ తర్వాత నల్లపురెడ్డి ప్రసన్నకు మార్ రెడ్డి ఇంటిని పరిశీలించనున్నారు. అయితే, జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు ఎవరూ జనసమీకరణ చేయకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హెలిప్యాడ్‌కు వద్దకు కేవలం 10 మందిని మాత్రమే అనుమతించారు. ఇక ప్రసన్న కుమార్ నివాసం వద్దకు 100 మందికి మాత్రమే పర్మీషన్ ఇచ్చారు.

ఈ క్రమంలోనే వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Former Minister Anil) కూటమి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ కేసులతో గత 50 రోజులుగా కాకాణిని జైల్లో పెట్టారని ఆరోపించారు. నేడు జగన్ పర్యటనకు కూడా అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. వేల మంది పోలీసులను పెట్టి ప్రజలకు రాకుండా అడ్డుకుంటున్నాని పేర్కొన్నారు. తమపై పెట్టినవి తప్పుడు కేసులని పిల్లలకు కూడా తెలుసని కామెంట్ చేశారు. అక్రమ కేసులను పెట్టేందుకు మాత్రమే పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు జగన్ కోసం తరలివస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Next Story