- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan | రాజ్యాంగ విలువలను కాపాడటమే నిజమైన నివాళి
రాజ్యాంగ విలువలను కాపాడటమే రాజ్యాంగ రూపకర్తలకు మనమిచ్చే నిజమైన నివాళి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాజ్యాంగ విలువలను కాపాడటమే రాజ్యాంగ రూపకర్తలకు మనమిచ్చే నిజమైన నివాళి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ (YS Jagan) అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ 76 ఏళ్ల క్రితం డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్వేచ్ఛ, సమానత్వమే పునాదులుగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. రాజ్యాంగ రూపకర్తల మండలి అందుకోసం ఎంతో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. మేధోమదనం తరువాత భారతీయ ప్రజలకు అనుగుణంగా.. వారి సంక్షేమాన్ని.. అభ్యున్నతిని.. హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడడమే రాజ్యాంగ రూపకర్తలకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. భయరహితంగా, పారదర్శకంగా ప్రజాస్వామ్యం ఉండేలా మనమంతా పాటుపడదామని పిలుపునిచ్చారు.






