- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
YS Jagan: పోసాని మురళీకృష్ణ అరెస్ట్.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాల నేపథ్యంలో నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై ఇటీవలే అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి (Obulavaripalli)లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాల నేపథ్యంలో నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై ఇటీవలే అన్నమయ్య జిల్లా (Annamayya District) ఓబులవారిపల్లి (Obulavaripalli)లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోసానికి బుధవారం రాత్రి హైదరాబాద్ (Hyderabad) రాయదుర్గం (Rayadurgam)లోని ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకుని ఇవాళ ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను రైల్వేకోడూరు (Railway Kodur) కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ క్రమంలోనే పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna) అరెస్ట్‌ను వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఖండించారు. ఈ మేరకు ఆయన స్వయంగా పోసాని సతీమణికి ఫోన్ చేసి పరామర్శించారు. అనంతరం రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. అదేవిధంగా పోసాని అరెస్ట్‌పై ఆయన తరఫు న్యాయవాది బాల (Bala) పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అరెస్ట్ విషయంలో పోలీసులు సీనియర్ సిటిజన్ యాక్ట్ (Senior Citizen Act) పాటించలేదని ఫైర్ అయ్యారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పోసాని అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్య అని న్యాయవాది బాల అన్నారు.






